- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ‘ఐ’ పోయింది.. ఇప్పుడు ‘వై’ కూడా పోబోతోంది: బీజేపీ ఎమ్మెల్యే సెటైర్లు
కాంగ్రెస్ ఐ పోయిందని, ఇప్పుడు వై కూడా పోబోతోందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు...

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్(Congress) ఐ పోయిందని, వై కూడా పోబోతోందని వైఎస్ జగన్(Ys Jagan), షర్మిల(Sharmila)నుద్దేశించి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి(Jammalamadugu BJP MLA Adinarayana Reddy) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, అమరావతి నిర్మాణం పున:ప్రారంభంపై వైసీపీ(Ycp), కాంగ్రెస్(Congress) నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి కొత్తగా 7 విమానాశ్రయాలు రాబోతున్నాయన్నారు. అమరావతి మోడీ సభ సూపర్ సక్సెస్ అయిందని చెప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణం ఉంటుందని ఆదినారాయణరెడ్డి తెలిపారు.
సూపర్ సిక్స్‌పై మాట్లాడే అర్హత జగన్ రెడ్డి, షర్మిల రెడ్డిలకు లేదని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రైతులను ఒప్పించి భూ సేకరణ చేసి అమరావతి నిర్మిస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్, రేషన్ కార్డులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే కొన్ని సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశ పెట్టారు. వచ్చే నెలలో మరో రెండు పథకాలు ప్రజలకు అందజేయబోతున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం, శాంతి భద్రతలు, ఉద్యోగ ఉపాధినే కూటమి నినాదమని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.






