- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐ శంకరయ్య వెనుకుంది వారే: బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
by Vemula.Srinu Prasad |
సీఐ శంకరయ్య వెనుకుంది వారేనని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy murder case)లో తన పరువుకు భంగం కలిగించారంటూ సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు పులివెందుల సీఐ శంకరయ్య(Pulivendula CI Shankaraiah) లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీఐ శంకరయ్య వెనుక వివేకానందారెడ్డి హత్య కేసు నిందితులే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(BJP MLA Adinarayana Reddy) ఆరోపించారు. సీఐ శంకరయ్యతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయించింది వారేనని ఆయన వ్యాఖ్యానించారు. వివేకా హత్య రోజు రక్తం మరకలు కడుగుతుంటే సీఐ శంకరయ్య ఏం చేశారని ప్రశ్నించారు. సీఐ శంకరయ్య హంతకులతో కుమ్మక్యయ్యారని, ఆయన పాత్రపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. శంకరయ్యపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసివేయాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






