- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లండన్‌లో చదివాడు, అమెరికాలో తిరిగాడు.. కుమారుడి డ్రగ్స్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సుధీర్ రెడ్డి మీద నమోదైన డ్రగ్స్ కేసుపై ఆది నారాయణరెడ్డి స్పందించారు. సుధీర్ లండన్‌లో ఎంపీఏ చదివి, అమెరికాలో తిరిగాడని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సుధీర్ రెడ్డి మీద నమోదైన డ్రగ్స్ కేసుపై ఆది నారాయణరెడ్డి స్పందించారు. సుధీర్ లండన్‌లో ఎంపీఏ చదివి, అమెరికాలో తిరిగాడని అన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని టెస్టు చేశారని.. ఆ టెస్టులో పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. ఇందులో వందశాతం రాజకీయ కోణం ఉందని ఆరోపించాడు. ఏదో చిన్న పొరపాటు జరిగిందన్నాడు. సుధీర్ ఒక విక్టిమ్ అని బాధితుడిని పట్టుకుని వంద ఛానళ్లలో దుష్ప్రచారం చేశారని వ్యాఖ్యానించాడు.
ఉదయం నుండి రాత్రి వరకు ఆదినారాయణ రెడ్డి కొడుకు అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఎవరేం చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుధీర్‌ను రాజకీయంలోకి దింపుతానని ఎవరు ఆపుతారో చూస్తానని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఈగల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో సుధీర్ కు డ్రగ్స్ టెస్టు చేయగా పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకుని డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించారు.






