‘జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు’.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

వైసీపీ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు’.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు లేదని ఆయన చెప్పారు. వైఎస్ జగన్‌(Former CM YS jagan) అవినీతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి(BJP Leader Bhanu Prakash Reddy) అన్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్లు రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడిచిందని విమర్శించారు. ఏపీని వికసిత ఆంధ్రప్రదేశ్‌గా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ తరుణంలో వైఎస్ జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు అని ఆయన ఫైరయ్యారు.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్‍కు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలను వైఎస్ జగన్ బెదిరిస్తున్నారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మాజీ సీఎం జగన్ చూపించే సినిమా చూసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు అన్నారు. ఇక, జగన్ జీవితాంతం పబ్జి ఆడుకోవడం, సినిమాలు చూసుకోవడమే అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‍ను నమ్మి ఐపీఎస్, ఐఏఎస్ లు జైలుపాలయ్యారని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Next Story