- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కదిరిలో అక్రమాలపై బీజేపీ నేత విష్ణు ఆగ్రహం... కలెక్టర్‌కు కంప్లైట్
కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న భారీ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(Kadiri Sub Registrar's Office)లో జరుగుతున్న భారీ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి(BJP state leader Vishnuvardhan Reddy) జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. కార్యాలయంలోని కొందరు సిబ్బంది, దళారీలతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, మార్కెట్ విలువను భారీగా తగ్గించి రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయ గండి కొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
సిబ్బందిపై చర్యలు తీసుకోండి
ఈ అక్రమాల వెనుక ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను తక్షణమే విచారించాలని కలెక్టర్‌కు విన్నవించారు. దళారీ వ్యవస్థను అరికట్టి, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేలా చూడాలని కోరారు. విలువైన ప్రభుత్వ భూములు, ప్రైవేటు ఆస్తుల విషయంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని విష్ణువర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.






