- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని చెప్పారు.. సోమువీర్రాజు పాటించారు
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఇంధన కొరత, పెరిగిన ధరల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉధ్రిక్త పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఇంధన కొరత, పెరిగిన ధరల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇంధనం వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగిచుకోవాలని మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.సీఎంలు, మంత్రులు తమ కాన్వాయ్ లను తగ్గించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ నాయకులు, అభినులు సైతం మోడీ పిలుపుతో ఇతరులకు ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పిలుపుతో ఇంధనం వృథా అవ్వకూడదని ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. అనంతరం కారు వద్ద నిలబడి వీడియో చేశారు. ప్రధాని విజ్ఞప్తికి అనుగునంగా పెట్రోల్, డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశానని అన్నారు. ఇది పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కార్ అని చెప్పారు. ప్రధాని ఆలోచనతో ఇప్పటికే తాను మూడు చోట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇదే విధంగా ప్రజలు కూడా ప్రధాని చెప్పినట్టుగా ఇంధన పొదుపుచేసి పర్యావరణాన్ని రక్షించాలని అన్నారు.






