- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Ap News: చంద్రబాబు అరెస్ట్‌పై పురంధేశ్వరి మరోసారి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ అధికారుల వ్యవహారం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆమె మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యాభవృద్ధి శిక్షణను, అవసరమైన సౌకర్యాలు స్కిల్ కేంద్రాల్లో కల్పించినట్లుగా తమ పరిశీలనలో ఉందని తెలిపారు. కేసు విచారణలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అధికారైనా స్పందించారా అని పురంధేశ్వరి ప్రశ్నించారు. అందువల్లనే చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై తాము ప్రశ్నిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. మంగళవారం మరోసారి కోర్టులో విచారణ జరనుంది. చంద్రబాబు, ఏపీ సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా?.. రాదా? అనే ఉత్కంఠ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.