Ambika Krishna : కూటమి ప్రభుత్వంపై బీజేపీ నేత అంబికా కృష్ణ ఫైర్ !

by Y. Venkata Narasimha Reddy |

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం(Coalition Government)పై క్రమంగా ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని... ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని బీజేపీ(BJP Leader) నేత,మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna)అంబికా కృష్ణ ఆగ్రహం(Anger) వ్యక్తం చేశారు

Ambika Krishna : కూటమి ప్రభుత్వంపై బీజేపీ నేత అంబికా కృష్ణ ఫైర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం(Coalition Government)పై క్రమంగా ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కార్యకర్తలు, నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని... ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని బీజేపీ(BJP Leader) నేత,మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ(Ambika Krishna)అంబికా కృష్ణ ఆగ్రహం(Anger) వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పార్టీ పరిస్థితిపై అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ బీజేపీని మిగతా పార్టీల పెద్దలు పట్టించకోవడం లేదని, ఎక్కడ చూసినా టీడీపీ, జనసేన జెండాలే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

క్రమశిక్షణ కల్గిన పార్టీ బీజేపీ అని.. అట్లాగని తిట్టినా, కొట్టినా నోరు మూసుకు కూర్చుంటున్న అతి క్రమశిక్షణ పార్టీలో నెలకొందన్నారు. బీజేపీ కేడర్ కు కూటమి ప్రభుత్వంలో ఎదురవుతున్న అవమానాల పట్ల పార్టీ అధిష్టానం పెద్ధలు ఎందుకు స్పందించడం లేదో నాకు అర్ధం కావడం లేదన్నారు. "కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రతీ కార్యకర్త బాధపడుతున్నారని.. తమకు సరైన గుర్తింపు లేదనుకుంటున్నారని.. బీజేపీ, జనసేన, టీడిపి కలిసి పోటీ చేస్తేనే ప్రభుత్వం ఏర్పాటయ్యిందన్న పరిస్థితి కనుమరుగవుతుందన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీ బీజేపీ నేతలకు ఆహ్వానించడం లేదని.. ఆఖరికి.. రోడ్డు ఓపెనింగ్ కార్యక్రమాలు జరిగిన పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి చెప్పినా స్పందన లేదని.. కలెక్టర్ కు సైతం మెమొరాండం ఇచ్చామని..ప్రభుత్వ కార్యక్రమాలపై కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఏపీలో ప్రధాని మోదీ పథకాలు డబ్బు ద్వారానే రాష్ట్రం నడుస్తోందని.. ప్రధానిమోడీ ఇచ్చే డబ్బులు వాడుకుంటూ బీజేపీ నేతలను కార్యక్రమాలకు ఎందుకు పిలవరు.?.. అని అంబికా కృష్ణ నిలదీశారు.

Next Story