- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతికే జై కొట్టిన బీజేపీ... మావిగన్‌పై స్టేట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రానికి ఒకే రాజధాని అని, అది కూడా అమరావతేనని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. జగన్ మావిగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి ఒకే రాజధాని(Capital) అని, అది కూడా అమరావతే(Amarvati)నని ఏపీ బీజేపీ(Ap Bjp) నేతలు స్పష్టం చేశారు. జగన్ మావిగన్(Mavigan)పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav), ఎమ్మెల్సీ సోము వీర్రాజు(Somu Veerrraju) స్పందించారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, దీన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే జగన్ మావిగన్‌ను తీసుకొచ్చారన్నారు. జగన్ తొలుత అమరావతికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత మాట మార్చి మూడు రాజధానులు అన్నారని, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధిని తట్టుకోలేక వైఎస్ జగన్(Ys Jagan) ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ చేసిన మోసాలను ఎన్నికల ప్రచారంలో వివరిస్తామన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎటు చూసినా అవినీతే కనిపించిందని చెప్పారు. రాజధాని కోసం జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని మండిపడ్డారు. మూడు రాజధానులంటూ ప్రజలకు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. జగన్ ఎజెండా మావిగన్ కాదని, మాయగాన్ అని బీజేపీ నేతలు మాధవ్, సోమువీర్రాజు విమర్శించారు.






