బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్, గుడ్డు తినొచ్చా?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-09 08:49:47  IST  )

ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం రేగిన సంగతి తెలిసిందే. చిత్తూరు, అన్న‌మయ్య జిల్లాల్లో వేల సంఖ్య‌లో కోళ్లు మ‌ర‌ణించాయి. చిత్తూరులోనే 28వేల కోళ్లు మ‌ర‌ణించాయి. దీంతో అధికారులు ఇప్ప‌టికే నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు.

బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్, గుడ్డు తినొచ్చా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం రేగిన సంగతి తెలిసిందే. చిత్తూరు, అన్న‌మయ్య జిల్లాల్లో వేల సంఖ్య‌లో కోళ్లు మ‌ర‌ణించాయి. చిత్తూరులోనే 28వేల కోళ్లు మ‌ర‌ణించాయి. దీంతో అధికారులు ఇప్ప‌టికే నివార‌ణ చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇక తాజాగా దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. బ‌ర్డ్ ఫ్లూ పూర్తిగా నియంత్ర‌ణ‌లో ఉంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. అన్న‌మయ్య జిల్లా స‌దుం మండ‌లంలో వ్యాధి నిర్ధార‌ణ అయిన వెంట‌నే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. కోళ్ల పెంపకం దారులు బ‌యోసెక్యూరిటీ చ‌ర్య‌లు పాటించాల‌ని ఆదేశించారు. కోడిమాంసం, గుడ్ల వినియోగం పూర్తిగా సుర‌క్షిత‌మని చెప్పారు. అసాధార‌ణ రీతిలో ప‌క్షులు మ‌ర‌ణిస్తే అధికారులు వెంట‌నే తెలియ‌జేయాల‌ని చెప్పారు.

చికెన్, గుడ్డు తినొచ్చా

సాధార‌ణంగా బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ సోకిన ల‌క్ష‌ణాల‌తో కోళ్లు ఉంటే వాటి రెట్ట‌, సొంగ‌తో మ‌నుషుల‌కు కూడా వ్యాపించే అవ‌కాశం ఉందని చెబుతున్నారు. బాగా ఉడికించిన చికెన్ లేదా కోడిగుడ్డు తిన‌డం వ‌ల్ల వైర‌స్ సోకిన‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆధారాలు లేవ‌ని చెప్పారు. బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ అధిక ఉష్ణోగ్ర‌త‌ల‌ను కూడా త‌ట్టుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. కాబ‌ట్టి ఎవ‌రైనా చికెన్, గుడ్డు తినాలనుకుంటే బాగా ఉడికించి తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌ని అంటున్నారు.

ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 28 వేల కోళ్లు మృతి

Next Story