ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 28 వేల కోళ్లు మృతి

by Ajay Maddhiboyina |

ఏపీలో మ‌రోసారి బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం రేపుతోంది. చిత్తూరు జిల్లా ప‌రిధిలోని స‌దుం మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో వైర‌స్ పంజా విసురుతోంది. వైర‌స్ కార‌ణంగా కోళ్ల ఫారాల్లో గ‌త వారం రోజులుగా కోళ్లు ఉన్న‌ట్టుండి చ‌నిపోతున్నాయి.

ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 28 వేల కోళ్లు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో మ‌రోసారి బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం రేపుతోంది. చిత్తూరు జిల్లా ప‌రిధిలోని స‌దుం మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో వైర‌స్ పంజా విసురుతోంది. వైర‌స్ కార‌ణంగా కోళ్ల ఫారాల్లో గ‌త వారం రోజులుగా కోళ్లు ఉన్న‌ట్టుండి చ‌నిపోతున్నాయి. దీంతో ఇప్ప‌టికే దాదాపు 28వేల కోళ్లు మృతి చెందాయి. వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ ఉండ‌టంతో ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించ‌కుండా మూడు కోళ్ల ఫారాల‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అంతే కాకుండా బ‌తికున్న కోళ్ల‌ను సైతం నిర్మూలించే ప్ర‌క్రియ మొద‌లుపెట్టారు. ఊరు బ‌య‌ట జేసీబీతో భారీ గుంత‌లు తీసి వాటిని శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో పూడ్చిపెడుతున్నారు. ఘ‌ట‌న‌పై స్థానిక ఎమ్మార్వో స్పందించారు. వ్యాధి సోకిన మూడు కోళ్ల ఫారాల‌ను త‌క్ష‌ణ‌మే సీజ్ చేసిన‌ట్టు చెప్పారు. ప్ర‌జ‌లు ఆ ప్రాంతాల‌కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించిన‌ట్టు తెలిపారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. అంతే కాకుండా కోళ్ల వ్య‌ర్థాలు ఎక్క‌డా పార‌వేయ‌వ‌ద్ద‌ని సూచించారు.

Next Story