- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలకలం రేపుతోన్న కొత్త వైరస్.. తక్షణమే చికెన్ షాపులు బంద్ చేయాలని ఆదేశం
రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు ప్రజలను మరో కొత్త వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు ప్రజలను మరో కొత్త వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వైరస్ కారణంగా జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్ ల్యాచ్‌కు పంపించారు.
తాజాగా వచ్చిన రిపోర్ట్స్‌తో కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూనే కారణమని అధికారులు నిర్ధారించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా తక్షణమే జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైరల్ కారణంగా కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో మూడు నెలల పాటు చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read More..






