- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bird Flu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. వారికీ డబ్బులే డబ్బులు..!
మొన్నటి వరకు " కోయ్ కోయ్ కోడిని కోయ్ " అంటూ ప్రతి ఆదివారం షాపుల వద్ద ఎగబడేవారు.

దిశ, వెబ్ డెస్క్ : బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్స్ తో ప్రజలు చికెన్ తినాలన్నా కూడా భయపడుతున్నారు. గత కొద్దీ రోజుల నుంచి కోడిని తినడమే మానేశారు. మొన్నటి వరకు " కోయ్ కోయ్ కోడిని కోయ్ " అంటూ ప్రతి ఆదివారం షాపుల వద్ద ఎగబడేవారు, కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. " కోడి వద్దు .. కూరగాయలే ముద్దు " అంటూ అవే తింటున్నారు. ఇక, నాన్ వెజ్ లవర్స్ లో కొందరు ముక్క ఎలాగో లేదు.. చేప , రొయ్యలు అయినా తిందామని చెరువుల వద్దకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు.
విశాఖలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ అక్కడి జనాలు చికెన్ ఊసే ఎత్తడం లేదు. వాటికీ బదులు చేపలు, రొయ్యలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వలన ఫిషింగ్ హార్బర్ వద్ద క్యూ కట్టారు. " ఒకేసారి జనాలు రావడంతో , చేపలు ఉత్పత్తి ధరలు కూడా భారీగా పెరిగాయి". " పోయిన నెల నుంచి ధరలు లేక నష్టాలు చూశాం " అని అంటున్నారు. "బర్డ్ ఫ్లూ వలన చికెన్ తినకుండా చేప, రొయ్యలు తినడం వలన ఆదాయం మంచిగా వస్తుంది" . " వేసవి కాలం మొదలైందంటే చాలు .. చేపలు సంపద పూర్తిగా తగ్గుతుంది". దాని కారణం చేపలు కూడా తక్కువ పడతాయి. కానీ, ఈ సారి "చేపల ధరలు పెరిగాయి". " రొయ్యలు బుట్ట రూ.1500 నుండి 2000 వరకు పెరిగింది. చేపలు అయితే రూ.800 నుండి 600 వరకు పెరిగింది. వంజరం 350 నుండి 600 రూపాయలు వరకు పెరిగింది" అని అంటున్నారు. మార్కెట్లో ప్రతి చేప కేజీకి 50 నుండి 100 రూపాయలు వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.






