నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన, షెడ్యూల్ ఇదే

by velandi.Saikiran |

ఏపీలో ఇవాళ పర్యటించిన బిల్ గేట్స్, 10 గంటల తర్వాత మొదట రియల్ టైం గవర్నర్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శిస్తారు.

నేడు అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన, షెడ్యూల్ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ ఏపీకి రాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏపీలో అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కూటమి సర్కార్ తో పలు కీలక రంగాలలో చర్చించేందుకు తన టీంతో కలిసి వస్తున్నారు. ముఖ్యంగా ఏపీ కూటమి మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో ప్రధానంగా సమావేశం అవుతారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి బిల్ గేట్స్ చేరుకుంటారు.

బిల్ గేట్స్ షెడ్యూల్ ఇదే

ఏపీలో ఇవాళ పర్యటించిన బిల్ గేట్స్, 10 గంటల తర్వాత మొదట రియల్ టైం గవర్నర్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు గురించి బిల్ గేట్స్ కు వివరించనున్నారు. విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికీ అమలు అవుతున్న ప్రాజెక్టులను మరింత విస్తరించడం పై ప్రధానంగా చర్చ జరుగుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 20047 లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత బిల్ గేట్స్ అండ్ టీం ఉండవల్లి వ్యవసాయ క్షేత్రంలో టెక్నాలజీతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలిస్తుంది.

Next Story