రాష్ట్రంలో ముగిసిన బిల్ గేట్స్ పర్యటన

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ పర్యటన ముగిసింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేకవిమానంలో ఢిల్లీకి పయనమయ్యారు.

రాష్ట్రంలో ముగిసిన బిల్ గేట్స్ పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఏపీ పర్యటన ముగిసింది. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లిన బిల్ గేట్స్ అండ్ టీమ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీతో పాలనా విధానంలో చేస్తున్న మార్పులు, సంజీవని ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం తదితర వాటిని పరిశీలించారు. వాటి గురించి సీఎం చంద్రబాబు నాయుడు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం, మంత్రులు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై కీలకంగా చర్చించారు. సుమారు ఐదున్నరగంటలపాటు బిల్ గేట్స్ రాష్ట్రంలో పర్యటించారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడిన ఆయన.. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ముంబై మీదుగా ఢిల్లీకి పయనమయ్యారు.

Next Story