విశాఖ తీరంలో స్పీడ్ షో.. ప్రత్యేక ఆకర్షణగా విదేశీ రైడర్ల స్టంట్లు

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-08 03:46:59  IST  )

ఏపీ(Andhra Pradesh)లో నిన్న(ఫిబ్రవరి 7) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రేసింగ్ విన్యాసాలు అద్భుతంగా జరిగాయి.

విశాఖ తీరంలో స్పీడ్ షో.. ప్రత్యేక ఆకర్షణగా విదేశీ రైడర్ల స్టంట్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో నిన్న(ఫిబ్రవరి 7) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రేసింగ్ విన్యాసాలు అద్భుతంగా జరిగాయి. విశాఖపట్నం(Vishakapatnam)లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఎంఆర్ఎఫ్ సూపర్‌క్రాస్ 2025 బైక్ రేసింగ్ ఫైనల్ పోటీలు(Bike race competitions) ఉత్సాహంగా జరిగాయి. దేశ విదేశాల నుంచి సుమారు 70 మంది రేసర్లు పాల్గొని సాహసోపేత విన్యాసాలతో అభిమానులను అలరించారు.


ఎంఆర్ఎఫ్ మోగ్రిప్ సూపర్‌క్రాస్-2025 పేరిట ఇప్పటివరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐదు రౌండ్లు పూర్తి కాగా, ఫైనల్ రౌండ్‌కు విశాఖపట్నం వేదికైంది. జర్మనీ, నార్వే రైడర్ల(foreign riders) స్టంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే, వేల సంఖ్యలో తరలివచ్చిన జనంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. కొందరు నకిలీ పాస్‌ల వల్ల ఇబ్బంది పడగా, రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.



Next Story