- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bike accident: బైక్సరదా.. వారిద్దరి ప్రాణం తీసింది..
వారిద్దరు మైనర్లు.. బైక్తీసుకుని మిగిలిన స్నేహితులను కలవడానికి వెళ్లారు.

దిశ, డైనమిక్బ్యూరో/ పల్నాడు: వారిద్దరు మైనర్లు.. బైక్తీసుకుని మిగిలిన స్నేహితులను కలవడానికి వెళ్లారు. సెలవు రోజును సరదా గడపాలనుకున్న ఆ స్నేహితులను స్నేహితులను మృత్యువు కబళించింది. శివరాత్రి పర్వదినం వేళ రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి శాలిపేటకు చెందిన నికిత్ (11), సంతోష్ (16) మంగళవారం మహా శివరాత్రి పాఠశాలలకు సెలవు కావటంతో ఇద్దరు కలసి నిర్మలానగర్ లో ఉన్న మిగతా స్నేహితులను కలిసేందుకు బైక్ పై బయలుదేరారు. బైక్ నిర్మలానగర్ సమీపిస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైక్ ను (Bike accident) ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. సత్తెనపల్లి ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు(Died). పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలు ద్విచక్రవాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. వారికి లైసెన్సు కూడా ఉండదు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రచారం నిర్వహిస్తోంది. అయినా ఎవరూ దానిని ఖాతరు చేయడం లేదు. చిన్నారులకు బైక్లు ఇస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో వారు బైక్ను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇందుకు సత్తెనపల్లిలో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. మృతి చెందిన ఇద్దరు బాలురూ మైనర్లు. స్నేహితులను బైక్పై కలవడానికి వెళ్లి.. ట్రాక్టర్ ఢీకొనడంతో చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయి. వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.






