కొత్త పింఛన్లపై బిగ్ అప్‌డేట్.. ఆన్‌లైన్ దరఖాస్తులపై మంత్రి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

కొత్త పింఛన్లపై కూటమి ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

కొత్త పింఛన్లపై బిగ్ అప్‌డేట్.. ఆన్‌లైన్ దరఖాస్తులపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త పెన్షన్ల (Pensions) మంజూరు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాబోయే జూన్ 12 నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) వెల్లడించారు. ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కోటబొమ్మాళి మండల పరిధిలోని నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త వితంతు పెన్షన్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని అన్నారు. అందుకోసం అర్హులైన మహిళలు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పిస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్న భరోసానిచ్చారు.

సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు..

అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి అచ్చెన్న అన్నారు. రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల (Agricultural Mechanization Equipment)ను అందించనున్నట్లుగా తెలిపారు. ట్రాక్టర్లు, రోటవేటర్లు, ఇతర ఆధునిక యంత్రాల కోసం రైతులు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Next Story