తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్

by Muthe.Rajitha |

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్నను అరెస్టు చేసి విచారించగా.. కీలక నిజాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. 2022 టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను అప్పన్న సంప్రదించి, నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్‌ చేశారు. ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు భోలేబాబా డెయిరీ యాజమాన్యం నిరాకరించింది.

దీంతో ఆ డెయిరీపై అనర్హత వేటు వేసేలా తనిఖీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. డెయిరీపై అనర్హతవేటు వేసేలా అజ్ఞాతవ్యక్తులతో పిటిషన్లు వేయించారు. చిన్నఅప్పన్న కుట్రతో బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణను తితిదే నిలిపివేసింది. ఆ స్థానంలో ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థ ప్రవేశించి.. రూ.138 ఎక్కువ కోట్‌ చేసింది. పోటీ లేకపోవడంతో కాంట్రాక్టు దక్కించుకుంది. కల్తీ నెయ్యి కేసులో అప్పన్నను 24వ నిందితుడిగా చేర్చింది.

Next Story