- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన పోలింగ్: పులివెందుల ఉప ఎన్నికలో సెన్సేషనల్ ట్విస్ట్
పులివెందుల జెడ్పీటీసీ(Pulivendula ZPTC) ఉప ఎన్నికలో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల జెడ్పీటీసీ(Pulivendula ZPTC) ఉప ఎన్నికలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రచారంలో నిమగ్నమై సొంతూరు తుమ్మలపల్లెలో వైసీపీ ZPTC అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇవాళ పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ(ZPTC) స్థానానికి కూడా పోలింగ్ జరిగింది. రెండు స్థానాల్లో కలిపి బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ మధ్యనే అసలు పోరు నడిచింది. బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉపఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అయితే క్యూలో ఉన్న అభ్యర్థులు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో చివరి ఓట్లు పోలవుతున్నాయి. కాగా సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం ఓటింగ్ నమోదవగా.. ఒంటిమిట్టలో 70 శాతం ఓటింగ్ నమోదైనట్టు అధికారులు తెలియజేశారు. భారీ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను కడప పట్టణానికి తరలిస్తున్నారు.






