- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గండికోట మైనర్ బాలిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్
గండికోట విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. విచారణ నేపథ్యంలో గండికోట విద్యార్థిని హత్య కేసులో పురోగతి లభించింది

దిశ, వెబ్ డెస్క్: గండికోట విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. విచారణ నేపథ్యంలో గండికోట విద్యార్థిని హత్య కేసులో పురోగతి లభించింది. కీలక ఆధారాలు దొరికాయని ప్రకటించారు డీఐజీ. లోకేష్ కు హత్యతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు డీఐజీ. అమ్మాయిపై అత్యాచారం జరగలేదని వెల్లడించారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్న పోలీసులు... సాయంత్రానికల్లా అన్ని విషయాలు చెబుతామని వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా.... గండికోట మైనర్ బాలిక మృతి కేసును నిన్నటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలో జాగిలంతో.. ఆధారాలు సేకరించారు పోలీసులు. అయితే ముందుగా ఇంటర్ విద్యార్థినిని... బైక్ పైన తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు... అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా.. లోకేష్ అడుగుజాడలను... ఆరా తీశారు. కానీ చివరికి ఈ సంఘటనలో... బాలికపై అత్యాచారం జరగలేదని తేల్చి చెప్పారు పోలీసులు. ఇవాళ సాయంత్రం... పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు.






