- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లొంగిపోయిన నిత్యానందరెడ్డి.. రహస్య ప్రాంతంలో విచారణ
కడపలో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు...

దిశ, వెబ్ డెస్క్: కడప(Kadapa)లో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసు(Pedda Dastagiri Murder)లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి(YSRCP leader, former deputy mayor Bandi Nithyananda Reddy) ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయన, అనూహ్యంగా తన లాయర్‌తో కలిసి నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని లొంగిపోయారు. ముందస్తు సమాచారంతో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, ఆయన నేరుగా ఎస్పీ ఎదుట హాజరుకావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పెద్ద దస్తగిరి దారుణ హత్య
ఏప్రిల్ 6న జరిగిన పెద్ద దస్తగిరి దారుణ హత్య వెనుక భూవివాదాలే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వివాదాల్లో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆయన్ని ఈ కేసులో ఏ-13 (A13) నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, నిత్యానందరెడ్డి వాంగ్మూలం ఆధారంగా హత్య వెనుక ఉన్న మరిన్ని కోణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
రహస్య ప్రాంతంలో విచారణ
నిత్యానందరెడ్డి లొంగుబాటు అనంతరం పోలీసులు ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. హత్యకు అసలు సూత్రధారి ఎవరు? ప్లాన్ ఎక్కడ జరిగింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. భూ సెటిల్‌మెంట్ల విషయంలో వచ్చిన విభేదాలే ఈ ఘాతుకానికి దారి తీశాయా లేదా ఇతర రాజకీయ కోణాలు ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.






