- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు
జగన్ (Jagan) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జగన్ (Jagan) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ముఖ్య నేత నారాయణ స్వామి (Narayana Swamy) మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపేందుకు ఏసీబీ కోర్టు (ACB Court) అనుమతినిచ్చింది. తాజా పరిణామంతో నారాయణ స్వామి ఎవరెవరితో మాట్లాడారు.. కాల్ డేటాతో పాటు, బ్యాంక్ లావాదేవీలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సిట్ కేసు మరింత బలపడేందుకు సిట్ అధికారులకు కీలక సాక్షాధారాలు లభించనున్నాయి. అయితే, నిందితుడు నారాయణ స్వామి నాటి వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా సిట్ అధికారులు ఆయనను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా నారాయణ స్వామి మొబైల్ ఫోన్‌ను ఏసీబీ కోర్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు పంపనుండటంతో కీలక ఆధారాలు వెలుగు రానున్నట్లుగా తెలుస్తోంది.






