- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి ఐపీఎస్ PSR ఆంజనేయులు పేరు
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్షల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ PSR ఆంజనేయులు పేరు తెరపైకి వచ్చింది. తాజాగా సిట్ అధికారులు కేసుకు సంబంధించి సిద్ధం చేసిన 200 పేజీల అడిషనల్ ఛార్జ్‌షీట్‌లో అత్యంత కీలక విషయాలను ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ కేసులోని నిందితులకు పీఎస్ఆర్ ఆంజనేయులు నుంచి 60 కాల్స్ వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు. ఎక్కడెక్కడా ఏ ఏ తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేశారు.. అందుకు సంబంధించి డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడి తరలించారో సిట్ అధికారులు తెలిపారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన ముడుపులతో బాలాజీ గోవిందప్ప బాన్సువాడతో పాటు మూడు చోట్ల స్థిర ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరు మీద కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్‌లో మొత్ం 11 చోట్ల 30.52 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లుగా సిట్ సిద్ధం చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.
కాగా, లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 19 సంస్థలు, 29 మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారని సిట్ తెలిపింది. అందులో A1గా రాజ్ కేసిరెడ్డి, A2గా బూనేటి చాణక్య, A30గా పైలా దిలీప్, A6గా సజ్జల శ్రీధర్‌రెడ్డి, A7గా కె.ధనుంజయ రెడ్డి, A32గా పి.కృష్ణ మోహన్‌రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీ, A34గా సీహెచ్ వెంకటేశ్ నాయుడు, A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A4గా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, A35గా బాలాజీ కుమార్ యాదవ్, A36గా నవీన్ కృష్ణ సహా మొత్తం 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన జ్యుడిషీయల్ రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.. మరో అడిషనల్ ఛార్జ్‌షీట్‌ను వేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.






