ఏపీలో మళ్లీ పెద్దపులి కలకలం.. నడకదారి పక్కన ప్రత్యక్షం

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం.. చుట్టు పక్కల గ్రామాల వాసుల్ని హడలెత్తించింది.

ఏపీలో మళ్లీ పెద్దపులి కలకలం.. నడకదారి పక్కన ప్రత్యక్షం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి సంచారం.. చుట్టు పక్కల గ్రామాల వాసుల్ని హడలెత్తించింది. తాజాగా మరోసారి పెద్దపులి ప్రత్యక్షమవ్వడం శైవ భక్తులను భయపెడుతోంది. ప్రకాశం జిల్లా దోర్నాలమండలం సరిహద్దు అటవీప్రాంతంలో పెద్దపులి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. నల్లమల అడవిలోని పెచ్చేరువు వద్ద కాలినడక మార్గంలో పెద్దపులి కనిపించగా.. శ్రీశైలంలో అన్నదానం కోసం సరుకులు తీసుకెళ్తున్న వాహనంలో ఉన్న వ్యక్తులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తుల్ని ముందు గమనించని పులి.. కాసేపటికి వారిని చూసినట్లుంది. వామ్మో వీళ్లెవరో నన్ను వీడియో తీస్తున్నారు.. ఇక్కడే ఉంటే తీసుకెళ్లి జూలో పడేస్తారు అన్నట్లుగా ఒక ఎక్స్ ప్రెషన్ పెట్టి పక్కకు వెళ్లిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో బ్రహ్మత్సవాలు జరుగుతుండగా.. భక్తులు కాలినడకన నల్లమల అటవీప్రాంతం నుంచి వచ్చేందుకు ఇటీవలే అధికారులు అనుమతిచ్చారు. ఈ క్రమంలో భక్తులు కాలినడకన వెళ్లే మార్గంలో పులి కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story