- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్యంలో పెద్దపులి సంచారం.. 20 రోజుల క్రితం హడలెత్తించింది ఈ పులే
పోలవరం జిల్లా రంపచోడవరంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఒక దూడను చంపడంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించి.. గ్రామాల ప్రజల్ని హడలెత్తించిన పెద్దపుల్లి మళ్లీ రంపచోడవరం మన్యంలో సంచరిస్తోంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు. గతరాత్రి పశువుల పాకలో ఒక దూడపై దాడిచేసిన పెద్దపులి.. దానిని చంపేసింది. ఈనెల తొలివారంలో కూర్మాపురం, సమీప గ్రామాల్లో సంచరించి అందరినీ హడలెత్తించిన పులిని అటవీశాఖ సిబ్బంది 6న కూర్మాపురం గ్రామంలోనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. అక్కడి నుంచి పులిని రాజమండ్రికి తరలించి, విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవిలో వదిలేశారు. ఆ పులే ఇప్పుడు రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. పెద్దపులి సంచారంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.






