- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో పెద్దపులి కలకలం
by Thanuru Gopichand |
పులి పేరు వింటేనే గుండె జారి చేతిలోకి వస్తుంది. అలాంటి పులి జనావాసాల మధ్య తిరుగుతుందంటే మనసు బెంబేలెత్తిపోతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : పులి పేరు వింటేనే గుండె జారి చేతిలోకి వస్తుంది. అలాంటి పులి జనావాసాల మధ్య తిరుగుతుందంటే మనసు బెంబేలెత్తిపోతుంది. ఇక మన ఊరు, మన వాడలో పులి తిరుగుతుందని తెలిస్తే కలకలం రేగిపోతుంది. అటువంటి సంఘటనే ప్రకాశం జిల్లాలో (Prakasam District) చోటు చేసుకుంది. దొర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురంలో పెద్దపులి (Tiger) సంచారం చేస్తుందనే వార్త వెలుగులోకి వస్తోంది. గండి చెరువు వద్ద ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దపులి సంచరిస్తుందని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడుతున్నారు. భయాందోళనలతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని పులి సంచారాన్ని పసిగట్టి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story






