27 మంది పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ షాక్

by Ajay Maddhiboyina |

విశాఖలో పార్టీ ఫిరాయింపు కార్పోరేటర్లకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎప్రిల్ 19వ తేదీన బీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన 27 మంది వైసీపీ కార్పోరేటర్లకు నోటీసులు జారీ చేశారు.

27 మంది పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ షాక్
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖలో పార్టీ ఫిరాయింపు కార్పోరేటర్లకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ఎప్రిల్ 19వ తేదీన బీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన 27 మంది వైసీపీ కార్పోరేటర్లకు నోటీసులు జారీ చేశారు. వారంలోగా కార్పోరేటర్లు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జీవీఎంసీ మేయర్ ఎన్నికలకు ముందే వైసీపీ ఎవరూ అవిశ్వాస తీర్మానానికి వెళ్లకూడదని, వెళ్లినా వైసీపీకే ఓటు వేయాలని కార్పోరేటర్లను ఆదేశించింది. దీనికి సంబంధించి విప్ జారీ చేసినా వైసీపీ బీఫామ్ తో గెలిచిన 27 మంది కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అప్పట్లో విప్ గా ఉన్న విజయ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారించి కలెక్టర్‌ను ఆదేశించడంతో కలెక్టర్ ఆ కార్పోరేటర్లకు నోటీసులు అందజేశారు. వారం రోజుల్లో కార్పోరేటర్లు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ కార్పోరేటర్లపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story