- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు
by Yella Dhawani Reddy |
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నానికి (Perni Nani) భారీ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పేర్ని నానికి (Perni Nani) భారీ షాక్ తగిలింది. పెడనలో 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమానికి నాని హాజరుకావాల్సి ఉండగా, వెళ్లేందుకు అనుమతి లేదంటూ ఆయనకు నోటీసులిచ్చారు. సెక్షన్ 30 అమల్లో ఉందన్న కారణంతో, పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించటంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ కింద పేర్ని నానిపై 353(2), 196(1) సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. కాగా, శనివారం కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో నానిని పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు.
Next Story






