- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న 24.84 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది..

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్న 24.84 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను స్థానిక తహసీల్దార్ తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
పల్నాడులో పరిశ్రమ స్థాపన
కాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు ప్రాంతంలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ పరిశ్రమ స్థాపన చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం భారీగా భూములను సేకరించి కేటాయించారు. అయితే 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల లీజు కాలపరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పొడిగిస్తూ జీవో విడుదల చేశారు. పరిశ్రమ నిర్మించకుండా స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా కేవలం విలువైన సున్నపురాయి నిల్వలున్న భూములను లీజుల పేరుతో తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దళిత రైతులకు చెందిన అసైన్డ్ భూములను బెదిరించి, బలవంతంగా లాక్కున్నారనే ఫిర్యాదులపై రీ-సర్వే నిర్వహించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని పవన్ ఆదేశించారు. ఈ దర్యాప్తులో 24.84 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయినట్లు తేలడంతో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుంది.






