AP Pensions:పింఛన్‌ లబ్ధిదారులకు బిగ్ షాక్.. రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-08 10:25:17  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది.

AP Pensions:పింఛన్‌ లబ్ధిదారులకు బిగ్ షాక్.. రేపు, ఎల్లుండి పింఛన్ల తనిఖీ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. దివ్యాంగులు(disabled people), ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తప్పుడు పత్రాలతో లబ్ధి పొందుతున్న వారిని ఏరి వేయనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు, ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది. ఒక్కో బృందం 40 పింఛన్లను పరిశీలిస్తుంది. ఇక ఈ తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇలా ప్రతి విభాగంలో స్థానికంగా ఉండే వైసీపీ నేతల సిఫారసుల మేరకు అనర్హులైన వారికి కూడా పింఛన్లు ఇచ్చారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story