పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే క్యాండిడేట్ జంప్

by Sathputhe Rajesh |   (  Updated:2024-03-20 14:51:16  IST  )

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉంటానని అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సెగ్మెంట్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ సీటుగా మారింది.

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే క్యాండిడేట్ జంప్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉంటానని అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సెగ్మెంట్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ సీటుగా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులు, కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంపై ఏపీ సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. వీలైనంత మంది ముఖ్య నేతలను పార్టీలోకి లాగేందుకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థి వంగా గీత, కాపు నేత ముద్రగడకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పిఠాపురంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మాకినీడు శేషు కుమారి జనసేన పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.

Read More..

సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే విజయం

Next Story