Acb Court: ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు

by Vemula.Srinu Prasad |

ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ షాక్ తగిలింది...

Acb Court: ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్(IPS officer Sanjay) అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీ(Remand prisoner)గా జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన రిమాండ్ గడువును తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court) పొడిగించింది. గత రిమాండ్ సమయం ముగియడంతో ఆయన్ను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం సంజయ్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సంజయ్ తరపున వాదనలు వినిపించారు. బెయిల్‌పై సిట్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అని కోర్టుకు తెలిపారు. దీంతో సంజయ్ బెయిల్ గడువును కోర్టు పొడిగించింది. ఈ మేరకు ఆయన్ను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్ గా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎస్సీ చట్టాలపై ఆయా వర్గాలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేపట్టింది. సంజయ్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం గుర్తించి ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది. ఫైర్ డిపార్టమెంట్‌లో ఎన్వోసీ జారీ అంశంలో అవినీతికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన లొంగిపోవడంతో కోర్టు రిమాండ్ విధించింది.

Next Story