ఐపీఎస్ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్.. రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-26 08:36:30  IST  )

ఫైర్ సెఫ్టీ పరికరాల(Fire Safety Equipment's) కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ (N Sanjay) ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.

ఐపీఎస్ అధికారి సంజయ్‌కి బిగ్ షాక్.. రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫైర్ సెఫ్టీ పరికరాల(Fire Safety Equipment's) కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ (N Sanjay) ఇవాళ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆయనకు వచ్చే నెల 8 వరకు రిమాండ్ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విజయవాడ జైలుకు తరలించారు.

కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో హయాంలో సంజయ్ సీఐడీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీల కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కోసం ప్రైవేటు సంస్థలతో కలిసి రూ.1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. అయితే, ఆ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ ఏడాది జనవరి 30న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అదేవిధంగా నిందితుడిగా ఉన్న సంజయ్‌‌ని కోర్టు ముందు లొంగిపోవడానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలోనే ఐపీఎస్ సంజయ్ విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.

Next Story