మాజీ మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పీఎస్‌లో కేసు నమోదు

by Kema Shiva Kumar |

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు ఊహించని షాక్ తగిలింది.

మాజీ మంత్రి అంబటికి బిగ్ షాక్.. ఆ పీఎస్‌లో కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై పట్టాభిపురం (Pattabhipuram) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం గుంటూరు (Guntur)లో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం సందర్భంగా అంబటి, తమ పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు టీజేపీఎస్ (TJPS) కళాశాల వద్ద అడ్డుకున్నారు. దీంతో సీరియస్ అయిన అంబటి రాంబాబు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సీఐ వెంకటేశర్లుతో వాగ్వాదానికి దిగుతూ.. పోలీసు సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా కొంతమంది వైసీపీ నేతలపై బీఎన్ఎస్ యాక్ట్ - సెక్షన్‌ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story