Breaking:మాజీ మంత్రి అంబటికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-20 05:56:55  IST  )

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Breaking:మాజీ మంత్రి అంబటికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గత నెల(జూన్) 18వ తేదీన పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) పర్యటన సందర్భంగా అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) పోలీసుల ఆంక్షలు ఉల్లఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ ఆరోపణల పై విచారణకు రావాలని మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు ఈ రోజు(ఆదివారం) నోటీసులు జారీ చేశారు. గతంలో సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్ లో అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి రజనీతో పాటు పలువురు జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 118 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు.

Next Story