మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. పులివెందుల ZPTC టీడీపీ కైవసం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-14 06:56:32  IST  )

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఉన్నికలు రాష్ట్ర ప్రజలతో పాటు ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ రేపాయి.

మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బిగ్ షాక్.. పులివెందుల ZPTC టీడీపీ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జడ్పీటీసీ (ZPTC) ఉప ఉన్నికలు రాష్ట్ర ప్రజలతో పాటు ప్రధాన పార్టీల్లోనూ ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కడపలోని ఉర్దూ యూనివర్సిటీలో ఉదయం 7 గంటలకు ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. కాసేపటి క్రితమే షాకింగ్ ఫలితం వెలువడింది. సొంత ఇలాఖాలో మాజీ సీఎం వైస్ జగన్‌కు ప్రజలు షాకిచ్చారు. ఈ మేరకు టీడీపీ అభ్యర్థి, పులివెందుల అసెంబ్లీ ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి భారీ విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,033 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించారు. అయితే, లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా.. హేమంత్ రెడ్డికి 683, ఇతరులకు 239 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మారెడ్డి లతారెడ్డి పులివెందుల జడ్పీటీసీగా ఎలెక్ట్ అయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాసేపట్లో ఆమెకు ధృవీకరణ పత్రం అందజేయనున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. మరికాసేపట్లో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఫలితం కూడా వెలువడే అవకాశం ఉంది.

కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ముఖ్య నేతల ముందస్తు అరెస్టులు, పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళనలతో దద్దరిల్లింది. అయితే, ఇవాళ కౌంటింగ్‌కు వైసీపీ ఏజెంట్లు ఎవరూ హాజరుకాలేదు. అదేవిధంగా వారు కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. పది టేబుళ్లను ఏర్పాటు చేసిన అధికారులు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. పులివెందులలో మొత్తం 7,638 ఓట్లు చెల్లుబాటు కాగా.. చెల్లని ఓట్లు 145, నోటాకు 11 ఓట్లు పోల్ అయినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పులివెందులలో టీడీపీ గెలుపు.. వైఎస్ అవినాశ్ రెడ్డి రియాక్షన్ ఇదే

YS జగన్ అడ్డాలో సైకిల్ సవారీ.. పులివెందుల పాలిటిక్స్‌కు బ్రేక్‌లు

Next Story