- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో బెల్టు షాపులకు బిగ్ షాక్.. కలెక్టర్లకు సీఎం సంచలన ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో బెల్టు షాపుదారులకు బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బెల్టు షాపుదారులకు బిగ్ షాక్ తగిలింది. ఇకనుంచే ఎక్కడ బెల్ట్ షాపు కనిపించినా ఉపేక్షించొద్దని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్, సాంకేతికంగా పౌర సేవలు అందించడంపై అమరావతిలో కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు ఈ గవర్నెన్స్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో వాట్సాప్ ద్వారా 500 సేవలందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు మార్కెట్లలో క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నిత్యావసరాల సరుకుల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Next Story






