హెరిటేజ్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాటిపై 5శాతం జీఎస్టీ ఖరారు

by Naga Rani Yarlagadda |

హెరిటేజ్ (Heritage) సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

హెరిటేజ్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాటిపై 5శాతం జీఎస్టీ ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: హెరిటేజ్ (Heritage) సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods)కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఏపీ హైకోర్టు (AP High Court) సహా.. వివిధ రాష్ట్రాల హైకోర్టులిచ్చిన తీర్పులను సవాల్ చేస్తు వేసిన పిటిషన్ ను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఫ్లేవర్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీని ఖరారు చేస్తున్నట్లు తెలిపింది.

హెరిటేజ్ ఫుడ్స్ తయారు చేస్తోన్న ఫ్లేవర్డ్ మిల్క్ (Flavoured Milk) పై 12 శాతం జీఎస్టీని విధించడంపై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు.. ఫ్లేవర్డ్ మిల్క్ కూడా పాలు, క్రీమ్ కేటగిరీలోకే వస్తుందని, అందుకు 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని జనవరి 29న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్రం పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. కేంద్రం ఇచ్చిన 12 శాతం జీఎస్టీకి బదులుగా.. 5 శాతం జీఎస్టీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Next Story