టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

by Shiva |
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం (Mangalagiri TDP Office)పై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh)‌ను మంగళగిరి పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్‌ (Hyderabad)లో అరెస్ట్ చేశారు. మియాపూర్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను గుంటూరు (Guntur) సీఐడీ ఆఫీసుకు తరలిస్తారా లేక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారా అనే విషయంలో స్పష్టత రాలేదు. కాగా, గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్‌‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఏపీ హైకోర్టు (AP High Court) కొట్టేసింది. దీంతో ఆయనను అరెస్ట్‌ చేసేందుకు బుధవారం ఉద్దండరాయుని పాలెంలోని తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో గత రెండు రోజులుగా సురేష్‌ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. తన మొబైల్‌ను కూడా స్విచ్ఛాఫ్‌ చేయంతో పోలీసులు చేసేదేమి లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. తాాజాగా ఫోన్ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం ఆయనను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed