జగన్ బర్త్ డే.. గోదావరి మధ్యలో బాహుబలి కటౌట్

by Ajay Maddhiboyina |

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు 53వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు సంబురాలు జ‌రుపుకుంటున్నారు.

జగన్ బర్త్ డే.. గోదావరి మధ్యలో బాహుబలి కటౌట్
X

దిశ‌, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు 53వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు సంబురాలు జ‌రుపుకుంటున్నారు. అయితే త‌మ అభిమాన నేత పుట్టిన రోజును కొంత‌మంది వినూత్న రీతిలో జ‌రుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ కార్య‌కర్త కంటే విన‌య్ గోదావ‌రి మ‌ధ్య‌లో ఉన్న బ్రిడ్జి లంక‌లో ఏకంగా 40వేల చ‌దరపు అడుగుల భారీ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లెక్సీలో హ్యాపీ బ‌ర్త్ డే జ‌న‌నేత అంటూ పేర్కొన్నారు. జ‌గ‌న్ ఫోటోల‌తో పాటు త‌న ఫోటోను వేయించుకున్నారు. ఇక ఈ ఫ్లెక్సీ డ్రోన్ విజువ‌ల్స్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోయేలా క‌నిపిస్తున్నాయి. భారీ ఫ్లెక్సీ ప‌క్క‌న నిలుచుకున్న మ‌నుషులు సైతం చీమ‌ల్లా క‌న‌పిస్తున్నారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన అనంత‌రం అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాని చుట్టూ వైసీపీ జెండాల‌ను ప‌ట్టుకుని జై జ‌గ‌న్ అంటూ నినాదాలు చేశారు.

Next Story