- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big Breaking: అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్!
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ (YSRCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో జరగనున్న ఏపీ బడ్జెట్ సమావేశాలకు (AP Budget Session) హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమావేశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరు కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక ఈ నెల 24న ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే మాజీ జగన్ సమావేశాలకు హాజరు కావడంపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి అసెంబ్లీకి రావాలా.. వద్దా..? అనే నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి మాత్రమే జగన్ హాజరు కానున్నారని మరో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జగన్ ఇంతవరకు అసెంబ్లీకి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పై వేటు వేస్తారని ప్రచారం ఊపందుకుంది. దీంతో జగన్ గవర్నర్ ప్రసంగానికి హాజరు అయ్యేలా వైసీపీ ప్రణాళికలు చేస్తోందని తెలుస్తోంది. కాగా ఏపీలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 24 తేదీ ఉదయం ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగం జరగనుంది. అలాగే 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. 15 రోజులకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం యోచనలో ఉంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలని అనేది తెలియనుంది.






