APPSC:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల తేదీలు ఖరారు

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-21 12:46:27  IST  )

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది.

APPSC:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆ పరీక్షల తేదీలు ఖరారు
X

దిశ,వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group 1 Mains Exams)ల కోసం అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1 షెడ్యూల్‌ను APPSC ఖరారు చేసింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు(Exams) జరుగుతాయని ప్రకటించింది. ఈ ఏడాది మే 3న తెలుగు, 4న ఇంగ్లీష్, 5న పేపర్ 1 జనరల్ ఎస్సే, 6న పేపర్2 హిస్టరీ, కల్చరల్, 7న పేపర్ 3 పాలిటీ, లా, 8న పేపర్ 4 ఎకానమీ, 9న పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ ఎగ్జామ్స్ జరుగుతాయని వివరించింది. పరీక్షలన్నీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని పేర్కొంది. ప్రశ్నాపత్రాన్ని ట్యూబుల్లో ఇవ్వనున్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ప్రకటించడం పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Next Story