- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. ఆ 28 పోస్టులకు 12,569 దరఖాస్తులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నిరుద్యోగులపై దృష్టి కేంద్రీకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నిరుద్యోగులపై దృష్టి కేంద్రీకరించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల భర్తీతో పాటు మెగా డీఎస్సీకి నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే సర్కార్ సీఐడీ విభాగంలో కాంట్రాక్ట్ బేస్‌లో 28 హోంగార్డు పోస్టలకు భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 12,569 మంది దరఖాస్తులు వచ్చాయి. అందులో ఫస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 7,684 అప్లికేషన్లను అధికారులు ఫైనల్ చేశారు. ఈ మేరకు మంగళగిరి APSP బెటాలియన్ గ్రౌండ్‌లో ఈ నెల 9న ఉదయం 6 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ పాటు సర్టిఫికెట్స్ (ఒరిజినల్స్) వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. టెస్ట్‌లలో ఎంపికైన అభ్యర్థులకు ప్రతిరోజు రూ.710 చొప్పున డ్యూటీ అలవెన్స్ మాత్రమే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.






