- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Forest Department:ఆ ప్రాంత ప్రజలకు బిగ్ అలర్ట్.. ఏనుగుల గుంపు సంచారం
by Jakkula.Mamatha |
ఆ జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది

X
దిశ,వెబ్‌డెస్క్: ఆ జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాం మండలం నేరేడువలస కొండపై ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు ఇవాళ(ఆదివారం) అటవీశాఖ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా కొమరాడ మండలం లో తిరిగిన ఈ ఏనుగులు ఇప్పుడు కురుపాం మండలానికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
Next Story






