- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రెండు రోజులు పాఠశాలలకు సెలవు
విశాఖపట్నం (Vishakhapatnam) వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘యోగా డే’ (Yoga Day)ను నిర్వహించేందుకు కూటమి సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం (Vishakhapatnam) వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘యోగా డే’ (Yoga Day)ను నిర్వహించేందుకు కూటమి సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మంత్రుల బృందం విశాఖకు వెళ్లి అక్కడే ఉండి ఏర్పాట్లును పర్యవేక్షిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) హాజరుకానుండటంతో ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ ప్రత్యామ్నాయ వేదికను కూడా రెడీ చేశారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు (CM Chandrababu) విశాఖకు చేరుకుని సన్నాహక కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ మిటింగ్ నిర్వహించనున్నారు.
‘యోగా డే’ సెలబ్రేషన్‌లో భాగంగా సుమారు 25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతాల్లో 20, 21వ తేదీల్లో ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలీ (Bhimili) వరకు చేపల వేటపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘యోగా డే’ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విశాఖ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఉదయం విద్యార్థులతో యోగా చేయించాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది.






