- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD News:శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ‘వీఐపీ బ్రేక్’ దర్శన వేళల్లో మార్పు.. ఆ రెండు రోజులు మాత్రం!?
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి సమయం ఎక్కువగా పడుతుంది. ఈ క్రమంలో భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించే విధంగా టీటీడీ(TTD) చర్యలు చేపడుతోంది. ఈ తరుణంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పు చేసింది.
ఈ నేపథ్యంలో తిరుమల(Tirumala) వీఐపీ బ్రేక్ దర్శనం వేళల్లో మార్పు నేటి(మే 1) నుంచి అమలు కానుంది. ఉదయం 5.45కు ప్రొటోకాల్ దర్శనం, 6.30 గంటలకు రిఫెరల్ ప్రొటోకాల్, 6.45 గంటలకు జనరల్ బ్రేక్ దర్శనాలు కల్పించనుంది. ప్రొటోకాల్, రిఫరల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల్లోపే పూర్తి చేసి సామాన్య భక్తుల(Devotees)కు మరింత ఎక్కువ సమయం దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళికలు చేసింది.
ఈ క్రమంలో 10.15గంటలకు శ్రీవాణి(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్), 10.30గంటలకు దాతలు, 11.00 గంటలకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనాలు కల్పించనున్నారు. మరోవైపు సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు నేటి నుంచి జులై 15 వరకు అనుమతించబోమని టీటీడీ(TTD) పేర్కొంది. ఇదిలా ఉంటే.. గురువారం శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ నేపథ్యంలో ఆ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.






