ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... ఆ కార్డు లేకపోయినా ఉచిత వైద్య సేవలు !

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి కూడా... వైద్యం అందించేందుకు చంద్రబాబు కూటమి ప్ర

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... ఆ కార్డు లేకపోయినా ఉచిత వైద్య సేవలు !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి కూడా... వైద్యం అందించేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైనప్పటికీ... కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్డు ( ఆరోగ్య శ్రీ ) లేకపోవడంతో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఆసుపత్రికి వెళ్తే... అధికారులు కార్డు అడుగుతున్నారని.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అలాంటి వారికోసం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్డు లేకపోయినా కూడా... అర్హులు అయితే వైద్యం అందించేందుకు అవకాశం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతితో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 3257 రకాల వ్యాధులకు... ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది ప్రభుత్వం. అయితే అర్హులు అయినప్పటికీ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారు కూడా ఉన్నారు. అయితే అలాంటివారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.

అక్కడ ఆరోగ్యం మిత్రకు చెందిన వ్యక్తిని కలిసి.. రేషన్ కార్డ్ తదితర వివరాలు సమర్పించాలి. దీంతో అక్కడ ఉన్న అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించి.. అర్హులుగా గుర్తిస్తారు. ఆ తర్వాత వైద్య సేవలు అందుతాయి. ఇలా ప్రతిరోజు జిల్లాలో 20 నుంచి 30 మంది.. అర్హత సాధిస్తున్నారట. అంటే ఇకపై ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్డు లేకపోయినా... అర్హులు అయితే.. వైద్య సేవలు అందుతాయి అన్నమాట.

Next Story