రైతులకు బిగ్ అలర్ట్.. ఇందులో మీ పేరు ఉందా?

by Jakkula.Mamatha |

రైతులకు బిగ్ అలర్ట్.. ఇందులో మీ పేరు ఉందా?
X

దిశ,వెబ్‌డెస్క్: రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పై మరో కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులమో? కాదో? తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవకు మీరు అర్హులా? లేదా? ఈ విధంగా తెలుసుకోవచ్చు. మొదటగా అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి. వెబ్‌సైట్‌లో Know Your Status ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. దీంతో రైతు పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్‌ కూడా స్క్రీన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో రైతులకు తాము అర్హులమో కాదో అన్న వివరాలు తెలుస్తాయి. అలాగే, ఎందుకు అనర్హత ఉందో కూడా కారణం తెలుసుకోవచ్చు.

అనర్హుల ఫిర్యాదు గడువు

ఏపీలో పీఎం కిసాన్ నిధులు విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెలలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా తొలి విడతలో రూ. 7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండో దశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవా కేంద్రం లోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈ నెల(జూలై) 10వ తేదీ లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సూచించారు.

Next Story