రైతులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-04 04:09:31  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది.

రైతులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో ఇటీవల ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి రూ.20 వేలు ఇచ్చే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం వాటా డబ్బులు రాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ పథకం అర్హులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి రేపటి(శనివారం) నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు. గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ఇవాళ(శుక్రవారం) విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో వెబ్ ల్యాండ్‌లో డేటా సరి చేయించుకోకపోతే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలకు అనర్హులు అవుతారని చెప్పారు. రైతు సేవా కంద్రంలో ఆర్జీలిస్తే పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే అర్హత సాదించిన రైతుల వివరాలు పోర్టర్‌లో ఉంచారు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అర్హులో.. కాదో తెలుసుకోవచ్చని తెలిపారు. అనర్హులు 155251 నం.కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నెల(జులై) 10న ప్రధాని నరేంద్ర మోడీ నిధులు విడుదల చేసే అవకాశముంది.

Next Story